ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టుకు రీడిజైనింగ్ - సీతారామ ప్రాజెక్టు

సీతారామ ప్రాజెక్ట్​ ప్రత్యేక రీ డిజైనింగ్​ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. రీ డిజైనింగ్​ ప్రతిపాదనలు స్థానిక శాసన సభ్యురాలు హరిప్రియకు చూపిన అనంతరం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల రైతులకు ఉపయోగపడేలా ప్రాజెక్టు డిజైన్​ ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.

Seetarama Project Re-design Sent To Government
సీతారామ ప్రాజెక్టుకు రీడీజైనింగ్
author img

By

Published : May 25, 2020, 10:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు రీ డిజైనింగ్​ ప్రతిపాదిత వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఎమ్మెల్యే హరిప్రియ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపేందుకు అనుమతి ఇచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులు ప్రాజెక్టు వల్ల లాభం పొందేలా డిజైన్​ ఉందని ఆమె అన్నారు. సీతారామ ప్రాజెక్టు ఒకటో ఫేజ్​ వల్ల ఇల్లెందు నియోజకవర్గంలోని చాలా తక్కువ మంది రైతులకు మేలు జరుగుతుందని, సాగుభూమి పెంచాలంటే ప్రాజెక్టు రీ డిజైన్​ చేయాలని ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తికి ఆమోదం లభించిందని అన్నారు.

అదనపు సాగుభూమి కోసం సర్వే చేయాలని ముఖ్యమంత్రి చేసిన ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంపై సర్వే చేపట్టి ఆయకట్టు పెరిగే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, గార్ల కామేపల్లి మండలాల్లోని 1.50లక్షల ఎకరాల భూమి సాగులో వచ్చేలా రూపకల్పన చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.