భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ రోడ్డులో ఓ ప్రైవేటు ఐటిఐ కళాశాలలో 25 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులంతా కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు, అధ్యాపకులకు విద్యార్థులు సన్మానం చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చావ లక్ష్మీనారాయణ, ఎడవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సొంత ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే