గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు 48.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరుసగా కురుస్తోన్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా వస్తోంది. మొదటి ప్రమాదం హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి : ఆశలు రేపుతున్న కొవాగ్జిన్... రెండో దశ పరీక్షలకు అడుగులు