భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో జేసీలు వెంకటేశ్వర్లు, అనుదీప్ పర్యటించారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్లు వీఆర్వోల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
భద్రాచలం పట్టణంలో నలుగురు వీఆర్వోల నుంచి తహసీల్దార్ నాగేశ్వరరావు దస్త్రాలను స్వీకరించారు. భద్రాచలంలో నలుగురు వీఆర్వోలు , ఇద్దరు వీఆర్ఏలు ఉన్నారు. దుమ్ముగూడెం మండలంలో 16 మంది వీఆర్వోలకు 2 ఖాళీలుండగా.. 14 మంది దస్త్రాలను తహసీల్దార్‌కు అందించారు. చర్ల మండలంలో 15 మంది వీఆర్వోలుండగా.. 15 మంది నుంచి తహసీల్దార్ దస్త్రాలను స్వీకరించారు. చర్లలో 14 మంది వీఆర్ఏలు ఉన్నారు.