భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అలాగే ఐటీడీఏ, కలెక్టర్ కార్యాలయాల్లో.. పీవో ఇంఛార్జ్, సబ్ కలెక్టర్ గౌతమ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఏడాది జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్