భద్రాద్రి రామయ్య సన్నిధిలో రథోత్సవం ఘనంగా జరిగింది. చిత్రకూట మండపంలో స్వామివారి ఎదుట ఇరుముడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య పాదుకలను ఆలయ ఈవో రమేశ్‌బాబు తలపై పెట్టుకుని గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో మాల విరమణ ఉత్సవం జరిపారు. శ్రీరామ దీక్ష చేపట్టిన వారు పునర్వసు నక్షత్రం సందర్భంగా తమ దీక్ష విరమించారు.
ఇదీ చూడండి : గంగా సప్తమిన వారణాసిలో ప్రత్యేక పూజలు