భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉదయపు నడకకు వెళ్లే వారితో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముచ్చటించారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని పట్టభద్రులను కోరారు.
రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పల్లా అన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్పర్సన్ సీతాలక్ష్మి, తెరాస రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యాదాద్రికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్