భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని విద్యార్థులు... పేదలకు మేమున్నామంటూ సహకారం అందించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-88 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కరోనా నేపథ్యంలో సొంతూరులో పేదలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వాట్సాప్ వేదికగా కలుసుకుని రూ.60 వేలు సేకరించుకున్నారు. వాటితో నిత్యావసరాలను సీఐ నాగరాజు, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్‌ల చేతుల మీదుగా పేదలు, వలసకూలీలకు అందజేశారు. పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా సేవాభావాన్ని చాటడం అభినందనీయమని అధికారులు ప్రశంసించారు.
ఇదీ చూడండి:- రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు