ETV Bharat / state

గ్రామ పంచాయతీలుగానే భద్రాచలం, సారపాక, రాజంపేట.. - ఖమ్మం తాజా వార్తులు

New gram panchayaths in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంను మూడు పంచాయతీలుగా, సారపాకను రెండు పంచాయతీలుగా చేయాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జనసాంద్రత ఆధారంగా పంచాయతీలను పురపాలికలుగా మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు ట్రైబల్ కౌన్సిల్ల్​లో ఆమోదం పొందలేదు.

bhadrachalam
bhadrachalam
author img

By

Published : Dec 17, 2022, 1:26 PM IST

ఏజెన్సీ ప్రాంతాల్లోని భద్రాచలం, సారపాక, రాజంపేట మళ్లీ గ్రామపంచాయతీలు అయ్యాయి. పురపాలికలుగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ట్రైబల్ కౌన్సిల్​లో ఆమోదం పొందలేదు. దీంతో వాటిని తిరిగి గ్రామపంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, సారపాక రెవెన్యూ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా విభజించారు. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించారు. 21 మంది సభ్యులతో భద్రాచలం, 17 మంది సభ్యులతో సీతారాంనగర్, 17 మంది సభ్యులతో శాంతినగర్ గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. సారపాక రెవెన్యూ గ్రామాన్ని రెండుగా విభజించారు. 17 మంది సభ్యులతో సారపాక, 15 మంది సభ్యులతో ఐటీసీ గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 11 మంది సభ్యులతో రాజంపేట గ్రామపంచాయతీని ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.