భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పశువుల యజమానులకు జరిమానాల బెడద తప్పటం లేదు. రహదారుల్లో డివైడర్ పైకి ఎక్కి మరీ మేకలు మొక్కలను తినేస్తుంటే... రోడ్లపై వచ్చే ఆవులు, గేదెలతోనూ తిప్పలు తప్పడం లేదు. పలుమార్లు హెచ్చరికలు జారీచేసిన మున్సిపల్ అధికారులు... జరిమానాలు విధిస్తామని ఇటీవల హెచ్చరించారు.
అయినప్పటికీ పశువుల యజమానులు యథేచ్ఛగా పశువులను రోడ్లపైకి వదలటం వల్ల అధికారులు వాటిని బందరు దొడ్లో కట్టేశారు. ప్రస్తుతానికి రూ.500 జరిమానా విధించనట్టు తెలిపారు. పశువుల యజమానుల వైఖరి మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.