ETV Bharat / state

komatireddy venkatareddy: 'ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పీసీసీ చీఫ్​తో సమానం' - రేవంత్​రెడ్డిపై ఫైర్​ అయిన కోమటిరెడ్డి

MP Komatireddy Venkatareddy comments: పీసీసీ కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పీసీసీ చీఫ్​తో సమానమేనని కొనియాడారు. నల్గొండ జిల్లాలో జరిగిన సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.

MP Komatireddy Venkatareddy
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
author img

By

Published : Dec 20, 2022, 6:56 PM IST

Updated : Dec 20, 2022, 10:25 PM IST

MP Komatireddy Venkatareddy comments: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్​లో పరిణామాలపై అధిష్ఠానం స్పందించడం హర్షణీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్​ పార్టీలో మార్పు వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో రేవంత్​రెడ్డి ఎందుకు ప్రచారం చేయలేదో తమకు సమాధానం చెప్పాలని కోరారు.

పీసీసీ కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లును పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన పీసీసీ కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ప్రతి కాంగ్రెస్​ పార్టీ కార్యకర్త పీసీసీ చీఫ్​తో సమానమని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. పైరవీలు చేసుకునే వారికే కమిటీల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదని.. అదే పక్క రాష్ట్రం ఏపీలో అయితే రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై తగు పరిష్కారం చూపాలన్నారు.

"దాదాపు 2500 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే పక్క రాష్ట్రం, లోతు బడ్జెట్​లో ఉన్న ఆంధ్రప్రదేశ్​లో రూ.1000 దాటితే బిల్లు ఉండదు. క్యాన్సర్​, గుండెజబ్బులు వంటి వాటికి ఉచితంగా చికిత్స అందిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు ఆసుపత్రికి వెళ్లాలంటే అప్పు అవుతున్నాడు. పేద ప్రజలు తమ వద్దకు వచ్చి ఆసుపత్రి బిల్లులు తగ్గించమని ప్రాధేయపడుతున్నారు." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.