ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులు.. మద్దతు తెలిపిన జయ సారథి రెడ్డినే ఎమ్మెల్సీగా గెలిపించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడా వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో.. అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు.
తెరాస పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని చాడా వెంకట్రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం.. మాయ మాటలతో మభ్యపెడుతూ నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసిందని.. తమ్మినేని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో తెలుసా...?