ETV Bharat / state

పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు: రేగా - MLA rega kantharao latest news

పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరులోని తహసీల్దార్​ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రెండు పడక గదుల ఇళ్లను అందజేశారు.

MLA rega kantharao distributed the Kalyana Lakshmi and Shadi Mubarak cheques
పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు: రేగా
author img

By

Published : Dec 10, 2020, 5:34 AM IST

పేద ప్రజల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని తహసీల్దార్ కార్యాలయంలో 117 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డ్రా పద్ధతిన లబ్ధిదారులకు మంజూరైన రెండు పడకల ఇళ్లను అందజేశారు.

పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'పంపులను పునరుద్ధరించే పనిలో నీటిపారుదలశాఖ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.