ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మానవత్వాన్ని చాటుకున్నారు. భద్రాచలం బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో సుమారు గంట సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బస్సులో ఓ మహిళ కడుపునోప్పితో బాధ పడుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆమెను తన వాహనంలో పాల్వంచ ఆసుపత్రికి పంపించారు.
విజయవాడ నుంచి భద్రాచలం వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సు గోదావరి నది వంతెనపై అకస్మాత్తుగా ఆగిపోయింది. బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో గంట సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పినపాక ఎమ్మెల్యే బస్సులో ఓ మహిళ కడుపునొప్పితో ఇబ్బంది పడటాన్ని గమనించారు. చికిత్స కోసం ఆమెను తన వాహనంలో పాల్వంచలోని ఆసుపత్రికి తరలించారు. వంతెన పక్కనే భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఆర్టీసీ డీఎం చెప్పడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు!