ETV Bharat / state

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పువ్వాడ - medical colleges news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాలాభిషేకం చేశారు. జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పాలాభిషేకం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
minister puvvada ajay kumar, Bhadradri Kothagudem District, medical colleges
author img

By

Published : May 18, 2021, 5:33 PM IST

చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల సీఎం కేసీఆర్‌ ఆశించిన విధంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి స్థానిక శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పాలాభిషేకం చేశారు.

గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాకు వైద్య కళాశాల కేటాయించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వైద్య కళాశాలలు కేటాయింపుపై సీఎంకు పాదాభివందనాలు: సత్యవతి రాఠోడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.