తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై ఈనాడులో వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆదేశాలతో చిన్నారుల ఇంటికి వెళ్లిన
ఎమ్మెల్యే హరిప్రియ వారిచదువు, భవిష్యత్ బాధ్యత తీసుకోవడం సహా రెండు పడకల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన గణేశ్, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గణేశ్... 2018లో గొంతు క్యాన్సర్‌తో చనిపోవడంతో భారమంతా స్రవంతిపై పడింది. ఆ తర్వాత ఆమె కూడా కిడ్నీ సమస్యతో అనారోగ్యానికి గురై చనిపోయింది. తల్లిదండ్రుల మృతితో వారిద్దరి చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు... వృద్ధులైన అమ్మమ్మ, తాతయ్యలు సంరక్షణలో ఉన్నారు.
చిన్నారుల పరిస్థితిపై ఈనాడులో వచ్చిన కథనాన్ని చూసిన స్థానికులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్‌కు సూచించారు. మంత్రి ఆదేశాలతో చిన్నారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే హరిప్రియ ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పిల్లల చదువు, భవిష్యత్ బాధ్యతతో పాటు రెండు పడకల ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
-
Great gesture MLA Garu 👏👏 https://t.co/l5cyz3yq5P
— KTR (@KTRTRS) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Great gesture MLA Garu 👏👏 https://t.co/l5cyz3yq5P
— KTR (@KTRTRS) June 10, 2021Great gesture MLA Garu 👏👏 https://t.co/l5cyz3yq5P
— KTR (@KTRTRS) June 10, 2021