పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రతి ఒక్కరు గుర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పురపాలక కమిషనర్ వెంకటస్వామి కోరారు. పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు పంపిణీ చేశారు.
కార్మికుల సంక్షేమం కోసం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైద్యురాలు మౌనిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.