బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా ఆదర్శంగా నిలుస్తోందని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) శంకర్ పేర్కొన్నారు. ఓసీ 2 గనిలో నూతనంగా కొనుగోలు చేసిన వంద టన్నుల సామర్థ్యం గల పది డంపర్లను ఆయన ప్రారంభించారు. ముందుగా డంపర్లకు పూజలు చేసిన డైరెక్టర్.. అనంతరం వాటి తాళాలను కార్మికులకు అందజేశారు.
బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని శంకర్ పేర్కొన్నారు. జనవరి నెలలో 100 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి.. మణుగూరు ఏరియా సింగరేణిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేసి అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇవీ చూడండి: 'స్పైస్ బోర్డు కాదు... పసుపు బోర్డు కావాలి'