భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలం అప్పారావు పేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షత వహించిన సభలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వెంకటేశ్ నేతకాని, స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.