భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గాంధీ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా పౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు మహాత్మ మారథాన్ 5కే రన్ని నిర్వహించారు. తొగ్గుడెం నుంచి రైల్వేస్టేషన్ వరకు కొనసాగిన పరుగులో 23 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గెలుపొందిన క్రీడాకారులకు తొగ్గుడెం సర్పంచ్ బొగ్గం రజిత బహుమతులు ప్రధానం చేశారు. ఆదర్శంగా నిలిచేలా గిరిజన గ్రామాల్లో మారథాన్ 5కే రన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో క్రీడాకారులు భవిష్యత్తులో క్రీడా పోటీల్లో పాల్గొని మంచి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.