కొలిచిన భక్తులకు కొంగు బంగారమైన గౌతమి తీరంలో గోదారమ్మకు మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలోని గోదావరి నది వద్ద జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఏటా కార్తీక పౌర్ణమికి గోదారమ్మకు మహా హారతులు అందిస్తారు. అనంతరం కమిటీ వారు ఉచితంగా అందించిన కార్తీక దీపాలను భక్తులు గోదావరి నదిలో విడిచిపెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండిః కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు