హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటుచేసి సంతాపం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను నడి రోడ్డుపై హత్య చేయడం దారుణమని తెలిపారు. వెంటనే దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దోషులను త్వరగా పట్టుకోవాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఐపీఎల్: ముంబయికి మిల్నే, కౌల్టర్నీల్, పీయూష్ చావ్లా