భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరోగ్యం నిర్బంధంలో ఉన్నది’ అంటూ రూపొందించిన కరపత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరినా, ఇతర దేశాల నుంచి వచ్చి ‘హోం క్వారెంటైన్’లో ఉన్న వారి ఇళ్లకు ఈ కరపత్రాన్ని అంటించనున్నారు. కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన వారి నివాసాల ముందూ ఈ కరపత్రాన్ని అతికిస్తున్నారు. అనుమానితులు, బాధితుల పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇతర వివరాలను ఆ కరపత్రంపై రాయనున్నారు. సదరు కుటుంబ సభ్యులు ఆదేశాలు ఉల్లంఘిస్తే ఇరుగుపొరుగు ఎవరిని సంప్రదించాలో... ఆ వివరాలను కూడా పేర్కొన్నారు.
జాగ్రత్త !! ఈ ఇంటి గడప తొక్కకూడదు - KOTHAGUDEM DIST HEALTH DEPARMENT WAS PLANNED TO POST POSTERS ON CORONA AFFECTEES
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కరోనా వ్యాధి లక్షణాలున్నా...ఆసుపత్రికి కరోనా పాజిటివ్‌తో వెళ్లినా ఆయా ఇళ్లకు కరపత్రాన్ని అంటించనున్నారు.