కోర్టు భవనాలతో పాటు న్యాయమూర్తి నివాసాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని... ఉమ్మడి ఖమ్మం జిల్లా న్యాయమూర్తి భూపతి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో న్యాయస్థానం భవనాల నిర్మాణం కోసం అటవీ శాఖ కేటాయించిన స్థలాన్ని ఆయన సందర్శించారు. అనంతరం స్థానిక కోర్టులో పెండింగ్ ఉన్న కేసులను పరిశీలించారు.
ఇల్లందులో అటవీ శాఖకు చెందిన క్రీడా మైదానాన్ని కోర్టు భవనాల నిర్మాణాలకు కేటాయించవద్దని... స్థానిక కాంగ్రెస్ నాయకులు అన్నారు. క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడే మైదానం పట్ల న్యాయమూర్తులు సహృదయంతో ఆలోచించాలని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు స్థానిక తహసీల్దార్ కృష్ణవేణికి వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: Stock Markets Live: లాభాల స్వీకరణతో ఒడుదొడుకుల్లో సూచీలు