ETV Bharat / state

భద్రాద్రి రామయ్య ఆస్తులను కాపాడండి - భద్రాద్రి

నగదు, బంగారం, భూములు... ఇలా మనకు తోచిన విధంగా దేవుడి పేరిట కానుకలుగా అందిస్తాం. ముఖ్యంగా భద్రాద్రి సీతారాముడికి భూమిని రాసివ్వడం ఎక్కువగా జరుగుతోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, కొందరి స్వార్థం కారణంగా.. ఆ భూములు ఆక్రమణ పర్వంలో మునుగుతున్నాయి.

భద్రాద్రి రామయ్య ఆస్తులను కాపాడండి
author img

By

Published : Jul 26, 2019, 8:55 PM IST

భద్రాద్రి రామయ్య ఆస్తులను కాపాడండి

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1345 ఎకరాల భూమి ఉంది. వాటి విలువ ఇప్పుడు వందల కోట్లకు పైగా పలుకుతోంది. కోట్ల విలువైన ఈ భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. దేవస్థానం అధికారులు పర్యవేక్షణ కరువై.. ఇప్పుడా భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. సుమారు 934 ఎకరాలు భూమి ప్రస్తుతం ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు... వెంటనే కొందరు భవనాలు నిర్మించడం, వ్యవసాయ భూమిగా మార్చేసి పంటలు పండిస్తున్నారు.

ఆక్రమణల పుణ్యమా.. ఆలయానికి కౌలు ఆదాయం పడిపోయింది. ఫలితంగా దేవస్థానం అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రస్తుతం భక్తులు ఇచ్చే విరాళాల ద్వారా వచ్చే వడ్డీతోనే నిత్యం పూజలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న భూములు రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తపట్నం, ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలోకి పోవడం వల్ల ఆలయ భూములను రక్షించుకోవడం మరింత కష్టంగా మారుతోంది. ఆలయ ఈవో కూడా ఆక్రమణదారులను వెళ్లగొట్టడం కష్టంగా ఉంటుందంటున్నారు.

రామయ్య మీద భక్తితో భక్తులు తాము ఎంతో కష్టపడి సంపాదించినదానిలో కొంత స్వామివారికి కానుకగా ఇచ్చారు. అలాంటి భూమి అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాకోరుల చేతుల్లో చిక్కడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ఎప్పటికైనా స్పందించి.. కబ్జా పొలాలను తిరిగి పొంది.. ఆలయ వైభవానికి కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆర్మీ 'ఆయుధ' ప్రదర్శన అద్భుతం

Intro:TG_SRD_42_26_SARVASABYA_SAMA_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.
ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హావేలి ఘనపూర్ మండలము లో మొదటి సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.....

హావేలి గణపూర్ మండల ప్రధమ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ,జెడ్పిటిసి లక్ష్మీ బాయి, జడ్పిటిసి సుజాత, సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీడీఓ.శ్రీనివాస్, మండల అధికారులు, పాల్గొన్నారు..
ఈ సమావేశంలోపద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించకుంటే వేటు తప్పదని అన్నారు.
వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు సమన్వయ లేకపోవడం వల్ల మండలంలోని రైతులకు రైతుబంధు రైతు బీమా అందడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
పశు సంవర్ధక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంలో ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని అన్నారు..
.మండల ఉపాధిహామీ సిబ్బంది సమన్వయంతో పని చేయకుండా ఉపాధి కార్మికులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
సమావేశంలో ఎంపిటిసిలు సర్పంచ్ లు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నదని ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయడం లేదని అన్ని గ్రామాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నీటి కొరత తీర్చాలని కోరారు....

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్ 9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.