భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక అధికారులు, సిబ్బంది ప్రధాన రహదారిపై తిరుగుతూ.. రోడ్లపై చెత్త వేస్తున్న ఇంటి యజమానులకు పట్టణ పరిశుభ్రత కోసం సహకరించాలని, రోడ్లపై చెత్త వేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రథమ బాధ్యత పౌరులదే అని గుర్తు చేశారు.
పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న పురాతన నిర్మాణాలపై దృష్టి పెట్టి అందులో నివాసముండే వారిని ఖాళీ చేయించి.. వాటిని కూల్చి వేస్తున్నారు. ప్రమాదం జరగకముందే పురాతన భవనాలను కూల్చివేస్తున్నమని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: నేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. కనిపించని సందడి