భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణవాసులకు శుభవార్త. పట్టణంలో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును పెంచాలని మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకులంగా స్పందించారు. గడువు పెంచేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని... దీనిపై తర్వలో తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు అభినందనలు తెలిపారు.
పట్టణంలో ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంత మందికి అవగాహన లేక చేసుకోలేక పోయారని మరో అవకాశం ఇస్తే 100% గృహ యజమానులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనివలన పురపాలక సంఘానికి ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు.