లాక్డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు దాతలు అండగా నిలబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు మండలంలో వెయ్యిమంది వలస కూలీలకు ఖమ్మం పట్టణానికి చెందిన హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా లారీ ద్వారా కాకర్ల, అనంతారం, రామచంద్రాపురం గ్రామాల్లో తిరిగి సరకులు అందజేశారు.
కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ రమణారెడ్డి, జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సై శ్రీకాంత్, ఇతర శాఖల అధికారులు కలిసి కూలీలకు అందజేశారు. పెద్దసంఖ్యలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ట్రస్టు సభ్యులను అధికారులు అభినందించారు. ప్రతి ఒక్కరూ పేదలకు తోడుగా నిలవాలని సూచించారు.
ఇదీ చూడండి: ఐఏఎస్ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం