ETV Bharat / state

సీతారాముల నాటి నివాసమే నేటి పర్ణశాల - పర్ణశాల విశిష్టత

శ్రీ రామచంద్రుడిని చూసినంతనే భద్రాద్రి యాత్ర పూర్తి అయిపోదు. ఈ దివ్య క్షేత్రం చుట్టూ భక్తులు ఖచ్చితంగా చూసి తరించాల్సిన ప్రాంతాలు ఎన్నో వున్నాయి. కొన్ని ప్రదేశాలు రామాయణం గాథను కళ్లకు కడితే... మరికొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మికతతో పాటు స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో సేద తీరుస్తాయి. భద్రాచలం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి.

parnashala
సీతారాముల నాటి నివాసమే నేటి పర్ణశాల
author img

By

Published : Dec 24, 2019, 3:14 PM IST

సీతారాముల నాటి నివాసమే నేటి పర్ణశాల

భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది పర్ణశాల. ఈ ప్రాంతం భద్రాచలం నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. వనవాస కాలంలో రాముడు... సీత, లక్ష్మణుడుతో కలిసి ఈ ప్రాంతంలో నివసించాడు. అప్పట్లో ఆకులతో నిర్మించిన ప్రదేశమే... ఈ పర్ణశాల. పర్ణశాల పరిసర ప్రాంతాలలో సీతా సమేతంగా రాములవారు నడయాడిన ఎన్నో గుర్తులు నేటికీ దర్శనమిస్తున్నాయి.

పసుపు, కుంకుమ శిలలు

సీతా రాముల వారు పండ్లు తిన్న పళ్లెం కూడా మనం చూడవచ్చు. మీరు చూస్తున్నవి సీతమ్మవారు ఆడిన వామన గుంటలు, ఆరేసిన నారచీర గుర్తులను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆచార్య ధర్మానికి ఆనవాలు సీత వాగు. నెలలో ఐదు రోజులు సీతమ్మవారు ఇక్కడ స్నానమాచరించే వారని ప్రతీతి. రాక్షసులు ప్రధానంగా వినికిడి, వాసన గుణాలను కలిగి ఉంటారు. అందుకే లక్ష్మణుుడు సూర్పణఖ ముక్కు చెవులను కోయుట వెనుక ఉన్న ఆంతర్యం. స్త్రీ సౌభాగ్యానికి ప్రధాన ద్రవ్యములు పసుపు కుంకుమలే అని తెలియజేసే పసుపు కుంకుమ శిలలు... జగదబి రాముడు కూర్చున్న రాతి సింహాసనం, ఏడేడు లోకాలు ఏలిన రామయ్య పాదాలు... నడుముకు చుట్టుకున్న నల్లని ఉత్తరీయం మనం చూడవచ్చు.

ప్రభుత్వమే చొరవ చూపాలి

అలనాటి ఆనవాళ్ళు నేటికీ సజీవంగా భక్తులకు దర్శన మిస్తున్నాయి. పర్ణశాలకు వచ్చిన భక్తులంతా సహజసిద్ధంగా ఉండే చిత్రాలను చూసి మంత్ర ముగ్దులు అవుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ పర్ణశాలలో... వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పాడల్సి వస్తోందని పర్యటకులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించి మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Intro:శ్రీ రామచంద్రుని చూసినంతనే భద్రాద్రి యాత్ర పూర్తి అయిపోదు. ఈ దివ్య క్షేత్రం చుట్టూ భక్తులు ఖచ్చితంగా చూసి తరించాల్సిన ప్రాంతాలు ఎన్నో వున్నాయి. కొన్ని ప్రదేశాలు అడుగడుగున రామాయణం గాధను కళ్లకు కడితే... మరికొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మికత తో పాటు స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో సేద తీరుస్తాయి భద్రాచలం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి..

Body:భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అన్నింటికంటే ముఖ్యమైనది పర్ణశాల. ఈ ప్రాంతం భద్రాచలం నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది .వనవాస కాలంలో రాముడు సీత లక్ష్మణుడు తో కలిసి ఈ ప్రాంతంలో నివసించాడు. అప్పట్లో ఆకులతో నిర్మించబడి నటువంటి ప్రదేశమే ఈ పర్ణశాల. సీతమ్మ వారి పరిసర ప్రాంతాలలో సీతా సమేతంగా రాములవారు నడయాడిన ఎన్నో గుర్తులు నేటికీ దర్శనమిస్తున్నాయి. సీతా రాముల వారు పండ్లు తిన్న పళ్లెం మనం చూడవచ్చు. మీరు చూస్తున్నవి సీతమ్మవారు ఆడిన వామన గుంటలు.. అవే కాకుండా సీతమ్మవారు ఆరేసిన నారచీర గుర్తు మనం చూడవచ్చు... ఆచార్య ధర్మానికి ఆనవాలు సీత వాగు.. నెలలో ఐదు రోజులు సీతమ్మవారు ఇక్కడ స్నానమాచరించే వారని ప్రతీతి.. రాక్షసులకు ప్రధాన గుణాలు కలిగి ఉంటాయి .వాటిలో వినికిడి ,వాసన గుణాలను ఖండించుట సూర్పణక ముక్కు చెవులను కోయుట వెనుక ఉన్న ఆంతర్యం స్త్రీ సౌభాగ్యానికి ప్రధాన ద్రవ్యములు పసుపు కుంకుమ లే అని తెలియజేసే ఈ పసుపు కుంకుమ శిలలు ...రాములు వారు కూర్చున్న రాతి సింహాసనం ఏడేడు లోకాలు ఏలిన రాముల వారి పాదాలు.. రాముడు నడుముకు చుట్టుకుని నల్లని ఉత్తరీయం మనం చూడవచ్చు.. ఇలా నాటి ఆనవాళ్ళు నేటికీ సజీవంగా భక్తులకు దర్శన మిస్తున్నాయి. రావణుడు సీతని ఎత్తుకుని డటంతో శ్రీరామునికి శోకమే మిగిలిందని దీంతో ఇక్కడ కొలువై ఉన్న రాముని అని పిలుస్తారు. స్వామి వారిని దర్శించుకోవడం వలన కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు .పర్ణశాలకు వచ్చిన భక్తులంతా సహజసిద్ధంగా ఉండే చిత్రాలను చూసి మంత్ర ముగ్దులు అవుతున్నారు..

Conclusion:పర్ణశాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్లు గాని ...ఎంమహిళల దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకమైన గదులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.. సకల సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.......
ఎండ్ పీటుసీ
బైట్స్: భక్తులు
ఫ్రం... శ్రీనివాస్ భద్రాచలం
లావణ్య ఈజెఎస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.