భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి బుధవారం నాడు లక్ష్మణ సమేత సీతారాములకు ఈ అభిషేకం నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్లను మండపం వద్దకు తీసుకువచ్చి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, నీటితో అభిషేకం నిర్వహించారు.
వేదపండితులు వేదమంత్రాలు పటిస్తుండగా అర్చకులు స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. స్వామి వారికి అభిషేకం చేయడం, దర్శించుకోవడం వల్ల సకల అభీష్టాలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'