ETV Bharat / state

భద్రాచలంలో గోదారమ్మకు మహా హారతి - భద్రాచలంలో గోదారమ్మకు మహా హారతి

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి  దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.

భద్రాచలంలో గోదారమ్మకు మహా హారతి
author img

By

Published : Nov 25, 2019, 10:27 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు సకల రాజలాంఛనాల నడుమ రామయ్య పాదుకలను గోదావరి నది వద్దకు తీసుకువచ్చి వాటికి పూజలు నిర్వహించారు.అనంతరం గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మకు పట్టు వస్త్రాలు, గాజులు సమర్పించారు. అనంతరం గోదావరికి ఈవో రమేష్ బాబు, ఆలయ అర్చకులు పంచ హారతులను అందించారు.

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు కార్తీక దీపాలను అందించారు. ఒకవైపు బాణాసంచాలు, మరో వైపు విద్యుత్ దీపాలు నడుమ గోదావరి నదీ తీరం మెరిసిపోయింది. అనంతరం పునర్వసు మండపం వద్ద భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

భద్రాచలంలో గోదారమ్మకు మహా హారతి

ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.