భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. నిన్న సాయంత్రం నుంచి వరద నీరు కాస్త తగ్గుతూ ఊరటనిస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు నీటిమట్టం 55.8 అడుగులకు చేరింది. చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతుంది.
వరద నేపథ్యంలో ఏజెన్సీ, విలీన మండలాలకు రాకపోకలు నిలిచాయి. ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: చరిత్రలోనే ఏడోసారి... భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి