భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలోని చర్ల ఏరియాలో గల రాళ్లపురం, కొండవాయి, చెన్నాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు లొంగిపోయారు. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా ఉన్న ఈ నలుగులు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ ఎదుట లొంగిపోయారు.
వీళ్లు చాలా కాలం నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు పెడుతున్న వేధింపులు భరించలేకే జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వాళ్లు తెలిపారని పేర్కొన్నారు. మిగతా మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛా జీవితం గడపాలని ఏఎస్పీ కోరారు.
ఇదీ చూడండి: