భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, శిరస్త్రాణం ధరించకుండా వాహనాలపై వస్తున్న వారిపై పోలీసులు జరిమానాలు విధించారు. ఇటీవల శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల మండలంలోని ఇద్దరు యువకులు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పలుమార్లు హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నా.. కొందరు పట్టణవాసులు పెడచెవిన పెట్టడం వల్ల పోలీసులు జరిమానాలు విధించడం ప్రారంభించారు. హెల్మెట్, పత్రాలు లేని వారిపై జరిమానాలు విధించారు.
ఇవీ చూడండి: మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు