kalki avathaaram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కోరిన అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ రామచంద్రుడు ఈరోజు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని రాజ వీధిలోని విశ్రాంత మండపం వద్ద ఘనంగా నిర్వహించే వారు. కానీ.. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలోని చిత్రకూట మండపంలో నిర్వహించారు.
శ్రీరామచంద్రుడు అశ్వంపై ధనుర్బాణాలు ధరించి కలియుగ పురుషుడిగా దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో ఉన్న స్వామివారి వాహనంతో పాటు, ఐదు వాహనాలలోని దేవతామూర్తులను చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రోచ్ఛారణలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దొంగల దోపోత్సవం వేడుక వైభవంగా జరిగింది. స్వామివారి బంగారు ఆభరణాలు దొంగిలించి పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునే వేడుక కన్నుల పండువగా సాగింది.
ఇదీ చూడండి: