భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కలెక్టర్ డాక్టర్ ఎంవీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలో కొనసాగుతున్న రైతు వేదిక నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. రైతువేదిక నిర్మాణాల వద్ద నాసిరకం ఇసుక వాడుతున్న విషయం తెలుసుకున్న కలెక్టర్... అలాంటి ఇసుకతో నిర్మాణాలు ఆపాలని ఆదేశించారు.
నాణ్యత కమిటీ..
జిల్లాలో నాణ్యత కమిటీని ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కమిటీ నివేదికల ఆధారంగానే బిల్లుల చెల్లిస్తామన్నారు. పలు చోట్ల మిషన్ భగీరథ నీరు రావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అక్టోబర్ చివరికల్లా అన్నీ గ్రామాల్లోని ఇంటింటికి నీరు సరఫరా చేసేందుకు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రశ్నించిన కలెక్టర్..
చాలా చోట్ల పైపు లైన్ పనులు చేపట్టలేదని ఎంవీరెడ్డి దృష్టికి రావడంతో ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. పలు నిర్మాణాల్లో నాసిరకం ఇసుక వాడటంతో పీఆర్‌ఏఈకి, వెంగన్నపాలెంలో బస్టాండ్ కూల్చినప్పటికీ స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి : తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్