ETV Bharat / state

Liquor shops: ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలు.. సిద్ధమైన ఆబ్కారీ శాఖ - ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలు పెంచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. అందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సర్కారుకు మరింత భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీ మొదలు కాబోతోంది. ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగంగా సాగుతున్నాయి.

liquor
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలు
author img

By

Published : Oct 24, 2021, 9:53 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం కిక్కు మరింత పెరగనుంది. ఇప్పటికే మద్యం అమ్మకాల్లో అగ్రభాగాన ఉన్న జిల్లాల్లో ఒకటి ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మద్యం అమ్మకాలతో మరింత భారీ ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వచ్చే నెల 30తో ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీ మొదలు కాబోతోంది. ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 50 మద్యం దుకాణాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ ఆదాయం సమకూరే ప్రాంతాల్లో షాపుల సంఖ్య పెరగనుండగా.. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా కోట్లాది రూపాయల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖాతాలో చేరనుంది. మందుబాబులకు మద్యం కిక్కు మరింత పెరగనుంది.

ఖమ్మం జిల్లాలో 30-35, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10-15 మద్యం దుకాణాలు పెంచేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కొత్త వైన్ షాపులు 2011 జనాభా ప్రతిపాదిత అంశంగా చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 165 మద్యం షాపులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 89, భద్రాద్రి జిల్లాలో 76 దుకాణాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 200 దాటనుంది. ఫలితంగా ఆబ్కారీ శాఖకు వచ్చే ఆదాయం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలతో సగటున నెలవారీగా రూ.170 కోట్ల ఆదాయం సమకూరుతుంది. గడిచిన సెప్టెంబర్ నెలలో ఖమ్మం జిల్లాలో రూ.109 కోట్లు, భద్రాద్రి జిల్లాలో రూ.55 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త దుకాణాలు వస్తే రెండు జిల్లాల్లో మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు..టెండర్లు, లైసెన్సుల పరంగా వచ్చే ఆదాయం పెరగనుంది. గతంలో మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఆబ్కారీశాఖకు రూ.86 కోట్ల ఆదాయం సమకూరింది. భద్రాద్రి జిల్లాలో దరఖాస్తుల రూపంలో రూ.44 కోట్లు ఆదాయం లభించింది. కొత్త దుకాణాలు వస్తే ఆదాయం మరింత పెరగనుంది.

సరిహద్దుల్లో కిక్కే కిక్కు

మద్యం అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాల్లో మద్యం ప్రియులకు ఆబ్కారీ శాఖ మరింత వెసులుబాటు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త దుకాణాలు నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు ఎక్కువ ఉండటం, అక్కడి మద్యం ప్రియులు ఎక్కువ ఇష్టపడే బ్రాండ్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల వారంతా ఉభయ జిల్లాల సరిహద్దుల్లోని వైన్ షాపులకు తరలివస్తున్నారు. ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు భారీగా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఫలితంగా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఉభయ జిల్లాల్లో ఇటువంటి ప్రాంతాలను ఆబ్కారీ శాఖ గుర్తిస్తోంది.

ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరగనుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరగటమే కాకుండా మద్యం ప్రియులకు దూరాభారం తగ్గనుంది. అంతేకాకుండా..స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వీటితోపాటు రాబోయే పాలసీలో మద్యం దుకాణాల టెండర్లలో రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. జిల్లా యూనిట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. గౌడ కులస్ఖులకు 15శాతం, ఎస్సీ సామాజిక వర్గానికి 10శాతం ఎస్టీ సామాజిక వర్గాలకు 5 శాతం చొప్పున రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాలు దక్కనున్నాయి. ఇలా మద్యం దుకాణాల పెంపుతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుండగా.. ఉభయ జిల్లాల్లో మద్యం ప్రియులకు మరింత కిక్కు పెరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జిల్లాల వారీగా పెరిగే వైన్ షాపుల సంఖ్యపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Srinivas Goud: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.