ETV Bharat / state

ఇల్లందు సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు

author img

By

Published : Apr 25, 2020, 11:05 AM IST

ఇల్లందులో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని అధికారులు అష్టదిగ్భందనం చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చే మార్గాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Establish check posts in Illandu town against the spread of corona virus
ఇల్లందు సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు నాలుగు చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల వారు నగరంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. చెక్​పోస్టుల పరిశీలనకు ఇద్దరు ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఎం.వి రెడ్డి నియమించారు. ఈ చెక్ పోస్టులను ఎమ్మెల్యే హరిప్రియ, తహసిల్దార్ మస్తాన్ రావు పర్యవేక్షించారు.

రంజాన్ మాసం ప్రారంభం కావటం వల్ల ఇల్లందు పోలీస్ స్టేషన్​లో మత పెద్దలతో సీఐ వేణు చందర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించి ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. మాణిక్యరం పంచాయతీలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు దుకాణదారులకు రెండు వేల చొప్పున అధికారులు జరిమానా విధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.