ETV Bharat / state

'వలస కూలీలకు అన్నదానం చేసిన యాచకురాలు' - Durga Bhavani is the beggar of Ashvaraoopete of Bodhradri Koshygudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యాచకురాలు దుర్గా భవాని.. వలస కూలీలకు అన్నదానం చేసి తన గొప్ప మనసు చాటుకుంది. వినాయకపురంలోని చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద.. మహారాష్ట్ర కూలీలకు సొంత ఖర్చులతో భోజన ఏర్పాట్లు చేసి వారి ఆకలి తీర్చింది.

durga-bhavani-is-the-beggar-of-ashwaraupettai-in-the-bodhradri-koshygudem-district
'వలస కూలీలకు అన్నదానం చేసిన యాచకురాలు'
author img

By

Published : May 31, 2020, 11:52 AM IST

లాక్​డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు ఓ యాచకురాలు అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యాచకురాలు దుర్గా భవాని.. అన్నదానం చేసి తన గొప్ప మనసు చాటుకుంది. వినాయకపురంలోని చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద.. జాతరలో జైంట్ వీల్ ప్రదర్శన కోసం మహారాష్ట్ర నుంచి 45 మంది వలస కూలీలు రెండు నెలల క్రితం వచ్చారు. లాక్​డౌన్ నేపథ్యంలో రవాణా నిలిచిపోవడం వల్ల వారు ఇక్కడే చిక్కుకుపోయారు.

సొంత ఖర్చులతో భోజనం

పనులు లేకపోవడం వల్ల పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారి దుస్థితి తెలుసుకున్న దుర్గా భవాని రెండు రోజుల క్రితం అల్పాహారం, పండ్లు అందజేసింది. సొంత ఖర్చులతో భోజనం ఏర్పాట్లు చేసి వారి ఆకలి తీర్చింది. గతంలో కూడా దుర్గా భవాని.. పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేసింది.

ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.