భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన హరిప్రసాద్ ఇల్లందులో పర్యటించారు. మాణిక్యారం పంచాయతీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా గ్రామస్థులపైనే ఉందని తెలిపారు.
రొంపేడు పంచాయతీలో జరిగిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు శ్రీనివాసరావు, అరుణ్, ఏపీఓ చందర్ బాబు, ఈసీ శంకర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు