భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాన్ని స్వచ్ఛ భద్రాద్రిగా తీర్చిదిద్దేందుకు సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రణాళిక రచించారు. పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు వావ్ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్మికులు, సిబ్బంది, విద్యార్థులతో స్వచ్ఛ ప్రమాణం చేయించారు. అనంతరం తడి చెత్త పొడి చెత్త వేరు చేసే సంచులను, డబ్బాలను అందజేశారు.
నేటి నుంచి ప్రతి ఇంటికి చెత్త సేకరించేందుకు సంచులు, డబ్బాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం తడి పొడి చెత్తను సేకరించే 7 నూతన ఆటోలను ప్రారంభించారు. ప్రజలంతా పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ హరి ఓం కారే ఐటీసీపీఎస్పీడీ సారపాక హెడ్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్గా మంత్రి సతీమణి..?