భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్.. వివిధ కారణాలతో చనిపోయిన ఆరుగురు సింగరేణి ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు నైపుణ్యతతో పని చేస్తూ, రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కారుణ్య ప్రక్రియ ద్వారా ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని మంచిగా చూసుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు మొత్తం 175 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 124 మందికి నియామక పత్రాలు అందజేశామని జీఎం తెలిపారు. ఈరోజు మరో ఆరుగురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు.