భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వేంకటేశ్వర కాలనీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వేంకటేశ్వర స్వామి వారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళవారం స్వామివారు రంగనాథస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి మేళతాళాల నడుమ కోలాటాలు, నృత్యాలు చేసుకుంటూ సేవ నిర్వహించారు.
ఇవీ చూడండి: పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ