భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు తరలివచ్చారు.
తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయం వద్దకు రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు