ETV Bharat / state

నత్తనడకన భద్రాద్రి జిల్లా వైద్యకళాశాల నిర్మాణ పనులు - కొత్తగూడెం జనరల్ ఆస్పత్రి భవనం

Bhadradri District Medical College: భద్రాద్రి జిల్లాకు కేటాయించిన వైద్య కళాశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్చి నుంచే విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం అనుకున్నా. నిర్మాణ పనులు మాత్రం ఆరీతిలో జరగడం లేదు. ఇప్పటికే మూడుసార్లు తుదిగడువు ముగిసినా... ఇంకా కళాశాల భవనాలు రూపుదాల్చుకోలేదు. మార్చి 21 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సిఉండగా... అప్పటికైనా పనులు పూర్తవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Bhadradri District Medical College
Bhadradri District Medical College
author img

By

Published : Feb 14, 2022, 4:36 AM IST

నత్తనడకన భద్రాద్రి జిల్లా వైద్యకళాశాల నిర్మాణ పనులు

delaying in Construction work of Bhadradri District Medical College: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు... ఇంకా ఊపందుకోవడం లేదు. ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా కొత్తగూడెం జనరల్ ఆస్పత్రి భవనంలో కొత్తగా ఈవైద్య కళాశాల నిర్మాణం సాగుతోంది. 6 కోట్లతో నిర్మాణమవుతున్న కళాశాలను... 2021 డిసెంబర్‌ నాటికే పూర్తిచేయాలని గడువు విధించారు. కానీ అప్పటికీ పనులు ముందుకు పడకపోవడంతో.. ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

40 శాతం పనులే పూర్తి..

ఐనా నిర్మాణ పనులు వేగంగా జరగకపోవడంతో మార్చి 21కి తుదిగడువు విధించారు. ఆ గడువులోగా కాలేజీ నిర్మాణం పూర్తిచేసి... విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలనుకున్నా పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు కేవలం... 40 శాతం పనులే పూర్తయ్యాయి. ఎక్కడా మౌలిక వసతులకల్పన జరగలేదు. విభాగాల విభజన, వైద్య పరికరాల గదులు, పడకలకు సంబంధించిన గదులు ఏర్పాటుకావాల్సి ఉంది. కళాశాల నిర్మాణాల ఆలస్యానికి కూలీల కొరత ప్రధాన కారణమవుతోంది.

పూర్తవుతాయా లేదా..

వైద్యకళాశాల నిర్మాణం పూర్తైతేనే ఈ ఏడాది నుంచి... మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌తోపాటు వైద్య విద్య బోధన సాగే అవకాశముంది. మార్చి 21 నుంచి తరగతులు ప్రారంభంచేయాలని... రాష్ట్రప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇందుకోసం కళాశాలకు సూపరింటెండెంట్, ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లని నియమించారు. నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండడంతో గడువులోగా పనులు పూర్తవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అంతంతమాత్రంగానే..

ఇక పాల్వంచ KASM కళాశాల సమీపంలో నిర్మిస్తున్న... మెడికల్, నర్సింగ్ కళాశాల పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మొత్తం 40 ఎకరాల్లో... 450 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. తరగతి గదులు, విద్యార్థులకు బస, మౌలికసదుపాయలు కల్పించాల్సి ఉంది. 2022 వరకు పూర్తిచేయాలని ఆదేశాలున్నా స్లాబ్‌ పనులతోపాటు నిర్మాణ పనులే మొదలుకాలేదు. ఇటీవల సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు... పనులు వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: ప్రకృతి ప్రేమికుడి కృషి.. చిగురించిన వటవృక్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.