భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సీతారాం ఏచూరితో పాటు మరో ఐదుగురిపై భాజపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారంటూ... ధర్నా చేపట్టారు.
సీపీఐ కార్యాలయంపై దాడికి దిగారని వామపక్ష నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా అధ్యక్షులు ఏజే రమేశ్ పాల్గొని భాజపా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.