ETV Bharat / state

'భద్రాచలాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు' - భద్రాచలం సమస్యలపై సీపీఎం ర్యాలీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలానికి ముప్పు ఉందంటూ సీపీఎం నాయకులు ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరుతూ చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్రలో భాగంగా సబ్​ కలెక్టర్​ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పట్టణాన్ని ముంచేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్​ రావు విమర్శించారు.

cpm leaders ryali in bhadrachalam in bhadradri kothagudem district
భద్రాచలంలో ర్యాలీ చేపట్టిన సీపీఎం నాయకులు
author img

By

Published : Feb 15, 2021, 4:48 PM IST

భద్రాచలంలో సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించకుండా పట్టణాన్ని ముంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మండిపడ్డారు. డిమాండ్ల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాచైత్యన్య యాత్ర పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా చివరిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

సమస్యలను పరిష్కరించాలంటూ సబ్​ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిడియం బాబురావు, అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, బాల నర్సారెడ్డి, రేణుక, వెంకటరెడ్డి, వైవి రామారావు, బండారి శరత్, గడ్డం స్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.