ETV Bharat / state

నల్ల బంగారంపై కరోనా ప్రభావం - corona effect on coal production in bhadradri

లాక్‌డౌన్‌ ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై పడింది. నెల రోజుల నుంచి గనుల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా ఆశించిన స్థాయిలో జరగలేదు. 2020-21 వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధన నిరుత్సాహంగా ప్రారంభమైంది. విద్యుత్తు ఉత్పత్తికి, ఇతర పరిశ్రమల నిర్వహణకు బొగ్గు అవసరం ఉండటంతో అత్యవసర విభాగం కింద లాక్‌డౌన్‌ నుంచి సింగరేణికి మినహాయింపు ఇచ్చారు.

corona-effect-on-singareni-coal-production-in-bhadradri
ఆరంభం.. మందకొడిగా
author img

By

Published : Apr 30, 2020, 7:53 AM IST

మణుగూరు ఓసీలో నిల్వ ఉంచిన బొగ్గుపై చల్లుతున్న నీళ్లు

లాక్​డౌన్​ ప్రభావం సింగరేణిపైనా పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు ఏరియాల్లో ఏప్రిల్‌లో 60 శాతం మించి ఉత్పత్తి జరగలేదు. రానున్న వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి, ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఏప్రిల్‌, మే నెలలు సింగరేణికి ఎంతో ముఖ్యం. ఈ రెండు నెలల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసి నిల్వ చేస్తుంది. ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొంది. భూగర్భ గనుల్లో లేఆఫ్‌ ప్రకటించటం ఉత్పత్తి తగ్గుదలకు మరో కారణంగా చెప్పొచ్ఛు

జిల్లాలో 9 ఉపరితల గనులు, 4 భూగర్భ గనులు ఉన్నాయి. మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల నుంచి వివిధ రకాల పరిశ్రమలకు బొగ్గు రవాణా అవుతుంది. కొవిడ్‌-19తో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు మినహా, మిగిలిన పరిశ్రమలు కొనసాగటం లేదు. డిమాండ్‌ లేక ఉత్పత్తి అయిన బొగ్గులో సగం మాత్రమే రవాణా అవుతోంది. మిగిలింది డంప్‌ యార్డుల్లో నిల్వ చేశారు. రైలు మార్గం ద్వారా రోజుకి 6-8 ర్యాకుల బొగ్గు రవాణా జరగాలి. కానీ 3-4 ర్యాకుల బొగ్గు మాత్రమే రవాణా అవుతుంది. బీటీపీఎస్‌లో బొగ్గు నిల్వ చేసేందుకు అవకాశం లేక ఈ నెల 21 నుంచి రవాణా నిలిచింది. ఇప్పటివరకు బీటీపీఎస్‌కు 43,770 టన్నుల రవాణా జరిగింది.

నిల్వ సాధ్యమేనా?

రవాణా చేయగా మిగలిన బొగ్గును డంప్‌ యార్డుల్లో నిల్వ చేయటం సులువేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాల్లోని మూడు ఏరియాల్లోని జీ 6, 7, 8, 9, 13, 15, 17 నాణ్యత కలిగిన బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ రోజుల పాటు డంప్‌ యార్డుల్లో నిల్వ ఉంటే మండే అవకాశం ఉంది. నీళ్లు చల్లే పనులు చేసినా ఎంత కాలం ఆపగలమని అధికారులు సందేహిస్తున్నారు.

డిమాండ్‌ లేకనే..:

'బొగ్గుకు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ లేక ఉత్పత్తి, రవాణా తగ్గింది. బీటీపీఎస్‌కు కూడా రవాణా నిలిచింది. యార్డుల్లో నిల్వ చేసిన బొగ్గు మండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా సాధారణ పరిస్థితులు రావటానికి నెల రోజులపైనే పడుతుంది.'

జక్కం రమేశ్‌, ప్రధాన అధికారి మణుగూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.