ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది: కేసీఆర్‌ - దమ్మపేట బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR Speech at Dammapeta Praja Ashirwada Sabha : సీతారామ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని స్పష్టం చేశారు. రైతుకు పెట్టుబడి స్థిరీకరణ ఉండాలనే ఉద్దేశంతో రైతుబంధు తెచ్చామని పేర్కొన్నారు. గతంలో రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

CM KCR Speech at Dammapeta Praja Ashirwada Sabha
CM KCR Speech
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 3:13 PM IST

Updated : Nov 13, 2023, 3:43 PM IST

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది: కేసీఆర్‌

CM KCR Speech at Dammapeta Praja Ashirwada Sabha : ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెప్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అన్నారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కళ్లముందు జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని సూచించారు. దమ్మపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ప్రతి పక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమైక్య పాలకుల వైఖరి వల్ల కొన్ని దశాబ్దాల పాటు వెనకబడిపోయామన్నారు. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేశారని విమర్శించారు.

KCR Comments on PM Modi : తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారని సీఎం చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించామని స్పష్టం చేశారు. విద్యుత్‌ కోతల నుంచి బయటపడి 24 గంటల కరెంట్‌ ఇచ్చే స్థాయికి వచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ప్రధాని మోదీ(PM Narendra Modi)) రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదని సీఎం వివరించారు.

CM KCR On Sitarama Project Works : సీతారామ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందన్న సీఎం.. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి స్థిరీకరణ ఉండాలనే ఉద్దేశంతో రైతుబంధు(Rythu Bandhu) తెచ్చామని కేసీఆర్ అన్నారు. గతంలో రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఆరోపించారు. రైతులు అప్పు చెల్లించకపోతే ఇంటి తలుపులు తీసుకెళ్లేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు

'బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే నాడు కాంగ్రెస్​ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది'

Dammapeta BRS Praja Ashirwada Sabha : రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలను వారంలోనే చెల్లిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. రైతుల భూముల్లో గోల్‌మాల్‌ జరగవద్దని ధరణి పోర్టల్‌ తెచ్చామన్న ఆయన.. రైతు వేలిముద్ర పెడితే తప్ప భూమి రికార్డులను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ ఉండటం వల్లే రైతుబంధు, రైతు బీమా సాధ్యం అవుతుందని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని విమర్శించారు.

'సీతారామ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెప్తున్నాయి. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. కళ్లముందు జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలి. సమైక్య పాలకుల వైఖరి వల్ల కొన్ని దశాబ్దాల పాటు వెనకబడిపోయాం. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించాం. విద్యుత్‌ కోతల నుంచి బయటపడి 24 గంటల కరెంట్‌ ఇచ్చే స్థాయికి వచ్చాం. ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదు.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM KCR Comments on Telangana Congress : కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోర్టల్‌ తీసేస్తామని చెప్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతుబంధు ద్వారా ప్రజల సొమ్ము వృథా చేస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు(Telangana Congress Leaders) అంటున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని వ్యాఖ్యానించారు. అశ్వారావుపేటలో 26 వేల ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గిరిజనులు సాగు చేసుకునే భూములపై వారికే హక్కులు ఇచ్చామని చెప్పారు. మనవద్ద, పక్కనున్న ఏపీలోని రోడ్ల పరిస్థితి బేరీజు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడిప్పుడే ప్రజలు, రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇలాగే కొనసాగిద్దామని వివరించారు. అశ్వారావుపేటలో అనేక పనులు చేయాలని నాగేశ్వరరావు అడిగారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.

నేటి నుంచి సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఇవాళ దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట సభలకు హాజరు

తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చే ప్రయత్నం - విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయండి : కేసీఆర్

Last Updated : Nov 13, 2023, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.