భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విపక్షాలకు, తెరాస పార్టీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కార్యాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం ఎన్నికలు జరుగుతున్న సమయంలో క్యాంపు కార్యాలయంలో వంటలు వండుతూ... ఓటర్లకు డబ్బులు పంచుతున్నరని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ శబరీశ్... ఇరుపక్షాలను శాంతపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో రహదారిని మూసివేశారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: క్యూలైన్లలో ఓటర్ల బారులు... ఎండలో తప్పని తిప్పలు